చెన్నై: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీ పాల్గొన్న ఆయన వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఓ కార్యకర్తను విరక్కొట్టుడు కొట్టి మీడియాకు చిక్కారు. ఈ విషయం వివాదంగా మారడంతో కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ఆ దృశ్యాలను చిక్రీకరించిన కలైంజ్ఞర్ టీవీ ఛానెన్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన విజయకాంత్ తనపై దుష్ప్రచారం చేసేందుకు దృశ్యాలను మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. అంతే కాదు .. సన్ టీవీ, కలైంజ్ఞర్ టీవీ ఛానెళ్ల యాజమాన్యానికి ఆయన నోటీసులు పంపించారు.
No comments:
Post a Comment