వేసవిలో స్టార్‌వార్
వేసవి వేడిలో ప్రేక్షకులను సందడి చేయడానికి నాలుగు భారీ చిత్రాలు రాబోతున్నాయి. క్రికెట్ హంగామా ముగింపు దశకు రావడంతో భారీ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అగ్రహీరోలు పవన్‌కల్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్ నటించిన 'తీన్‌మార్', 'శక్తి', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', రానా, ఇలియానా నటించిన 'నేను నా రాక్షసి' వేసవిలో రానున్నాయి. వేసవిలో స్టార్ వార్ జరగనుంది. వాణిజ్యపరంగా కూడా వీటిపై భారీ అంచనాలున్నాయి. ఈ నాలుగు చిత్రాలకు కలిపి సుమారు 160 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దాదాపు 1300 థియేటర్లను ఈ చిత్రాల ప్రదర్శనకు ముస్తాబవుతున్నాయి. జూ.ఎన్టీఆర్ కెరిర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'శక్తి' ఏప్రిల్ 1న వస్తోంది. సీనియర్ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మెహర్‌రమేష్ దర్శకుడు. కొద్ది విరామం తర్వాత పవన్‌కల్యాణ్ నటించిన 'తీన్‌మార్' వస్తోంది. అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. దీనికి నటుడు గణష్ నిర్మాత. జయంత్ దర్శకుడు. ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' కూడా వేసవిలో వస్తుంది. దీనికి దిల్ రాజు నిర్మాతకాగా, దశరథ్ దర్శకత్వం వహించారు. వీటికి తోడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'నేను నా రాక్షసి' కూడా విడుదలకు ముస్తా బవుతోంది.
No comments:
Post a Comment