ఇస్లామాబాద్: ఇండియా చేతిలో పాకి స్థాన్ ఘోర పరాజయం చెందడాన్ని ఆ దేశ పత్రికలు సహించలేకపోయాయి. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో పాక్ ఓటమి 'సామూహిక వధ'అని పతాక శీర్షికలతో ఉర్దూ, ఇంగ్లీష్ పత్రికలు విరుచుకుపడ్డాయి. అత్యంత పేలవమైన ఆటను, ఫీల్డింగ్‌ను ప్రదర్శించారని దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. క్రీడాకారులు తమ ప్రతిభను సరైన రీతిలో కనబరచలేదని విమర్శించాయి. క్యాచ్‌లను వదిలివేయడం, పేలవమైన షాట్లు, మిస్బా చేసిన ఇన్నింగ్స్‌ను పాక్ ఓటమికి కారణాలుగా డాన్, తదితర పత్రికలు పేర్కొన్నాయి.
No comments:
Post a Comment