హైదరాబాద్: కాలిఫోర్నియా కేంద్రంగా ఆన్‌లైన్ బిజినెస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలందిస్తున్న జోహో కార్పొరేషన్ చిన్న, మధ్య తరహా కంపెనీల కోసం ఆడియో - విడియో చాటింగ్ సేవలను డిసెంబర్‌లోగా అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త అప్లికేషన్‌లో జోహో మెయిల్ వంటి అదనపు ఫీచర్లనూ అందిస్తున్నామని, బిజినెస్, ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దామని సంస్థ ఆసియా పసిఫిక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ మార్తి వివరించారు. ఇక్కడ జరుగుతున్న 20వ అంతర్జాతీయ వరల్డ్ వైడ్ వెబ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన సైడ్‌లైన్స్‌లో మీడియాతో మాట్లాడారు.
యాహూ లేదా గూగుల్‌లో ఎకౌంట్‌ను కలిగివున్నవారు జోహోలో సైన్ చేసి విడియో ఆడియో చాటింగ్ సేవలు పొందవచ్చని, ఇందుకోసం తాము ప్లగ్-ఇన్‌లను అందిస్తామని వివరించారు. ప్రారంభదశలో జోహో మెయిల్ సేవల కోసం సంవత్సరానికి 25 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సంస్థ చెన్నైలో నిర్వహిస్తున్న కార్యాలయంలో 1500 మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్ పిసిల కోసం 28 కొత్త అప్లికేషన్లను విడుదల చేయనున్నామని వివరించారు.
No comments:
Post a Comment