బీజింగ్ : కేవలం ముందు రెండు కాళ్లతో నడుస్తున్న మేకపిల్ల చైనాలో వెలుగు చూసింది. లియాంగింగ్ రాష్ట్రం యాంగ్జీ ప్రాంతంలోని హెగ్జింగ్ గ్రామ వాసి ల్వీ (61) మాట్లాడుతూ మూడు నెలల క్రితం చిన్న ఊతకర్రలాంటి వెనక కాళ్లతో జన్మించిన మేకపిల్ల మనుగడ సాగిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు. తాను పలు దఫాలు ఆ మేకపిల్లను నిలబెట్టేందుకు విఫలయత్నం చేశానని ల్వీ పేర్కొన్నాడు. ప్రతిరోజు తాను, తన భార్య ఆ మేకపిల్లను ఎత్తుకుని తల్లి మేక వద్దకు తీసుకెళ్లి పాలు త్రాగిస్తున్నామని ల్వీ తెలిపాడు. అయితే ముందుకాళ్లతోనే నిలబడేందుకు ప్రయత్నిస్తున్న ఈ బుల్లి మేక వెంటనే పడిపోతుందని ఆయన వివరించాడు. నిత్యం ఈ బుల్లి మేకకు ముందు కాళ్ల ఆధారంగా నడిచేందుకు శిక్షణనిస్తున్నామని ల్వీ తెలిపాడు. ఈ విషయం తెలిసి చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రతిరోజూ వచ్చి వెళుతున్నారని ల్వీ తెలిపాడు. మూడు నెలల శిక్షణ తర్వాత ప్రస్తుతం తన తల్లి మేక వద్దకు వెళ్లి పాలు తాగుతోందన్న ల్వీ తన జీవితంలో ఇటువంటి వింత చూడలేదన్నాడు.
No comments:
Post a Comment