Sunday, April 3, 2011

14న వస్తున్న 'తీన్‌మార్‌'


అటు చిత్ర పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకాభిమానుల్లోను పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం 'తీన్‌మార్‌'పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా...ఎప్పుడు చూద్దామా! అన్న ఆతృత ప్రేక్షకలోకంలో ఎంతగానో ఉంది. కాగా ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత గణష్‌బాబు ప్రకటించారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారని ఆయన తెలిపారు. అర్జున్‌ పాల్వాయ్‌గాను, మైఖెల్‌ వేలాయుధంగాను ఆయన కనిపిస్తారని నిర్మాత చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకు విశేషమైన ఆదరణ లభించిందని అన్నారు. చార్ట్‌బస్టర్‌లో నెంబర్‌వన్‌ ఆడియోగా నిలిచిందని అన్నారు. ప్రేక్షకాభిమానులు ఏమైతే కోరుకుంటారో అది నూరుశాతం తెరపైన ఉంటుందని, ఈ చిత్రం ప్రోమోస్‌, పోస్టర్లు చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. పవన్‌ నటన, జయంత్‌ దర్శకత్వం, త్రివిక్రమ్‌ సంభాషణలు, మణిశర్మ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు.
దర్శకుడు జయంత్‌ మాట్లాడుతూ, పవన్‌ నటన అద్భుతమైతే, ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో అతను నటించినతీరు అభినందించాల్సిందేనని అన్నారు. నేటికాలంలో ప్రేమకు సరైన విలువ లేకుండా పోతోందని, ప్రేమికులకి విలువ తగ్గుతున్న ఈ రోజుల్లో ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమకున్న విలువని అద్భుతంగా తెరకెక్కించామని ఆయన వివరించారు. పక్కా కమర్షియల్‌ అంశాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరసన త్రిష నటించగా, ఇంకా కృతి, పరేష్‌రావల్‌, అలీ, సోనూసూద్‌, ముఖేష్‌రుషి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: మణిశర్మ.

No comments:

Post a Comment