Sunday, April 10, 2011

అవినీతిపరుల్ని ఉరితీయాలి


  • మరింత పదునైన చట్టాలు తేవాలి
  • నేను రాజకీయాల్లోకి రాను
  • ఢిల్లీ మీడియాతో అన్నా హజారే
న్యూ ఢిల్లీ :అవినీతిపై పోరాటానికి ఇంత స్పందన ఊహించలేదు. అవినీతిపరులను ఉరితీయాలి, మరిన్ని పదునైన చట్టాలు తేవాలి, నేను రాజకీయాల్లోకి రాను, లోకపాేల్‌ ఆందోళనలో చేతులు కలిపిన అందరికీ కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యం, చట్టసభల మీద నమ్మకం లేదా అని కొందరు నన్ను అనుమానిస్తున్నారు. నాకు నమ్మకం ఉంది, అయితే గతంలో చాలాసార్లు లోకపాేల్‌ బిల్లు సభ ముందుకు వచ్చింది. కానీ అమలుకు నోచుకోలేదు. లోకపాేల్‌ బిల్లు ముసాయిదా రూపొందించేటప్పుడు దాన్ని వీడియో తీయాలి' అని హజారే పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో
దేశంలోని సామాజిక సేవా ఉద్యమకారులు అవినీతిపై పోరాటం విషయంలో చేయవలసిం ది ఎంతో ఉన్నందునమరింత కఠినతరమైన లోక్‌పాల్‌ బిల్లు నిమిత్తం తదుపరి వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే ఆదివారం పేర్కొన్నారు. 'మేము తదుపరి వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించిన చిన్న పోరాటంలో విజయం సాధించినందున సమాజంలోని వివిధ స్థాయిల్లో ఉన్న అవినీతిని ఎదుర్కొనేందుకు మరిన్ని చట్టాలకు కృషి చేయాలని భావిస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. సమర్థమైన లోక్‌పాల్‌ బిల్లు ఏర్పాటుకు పది మంది సభ్యుల సంయుక్త కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిపారు. ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలో ప్రాంభించాలని తాను భావించానని, అయితే కిరణ్‌ బేడీ, స్వామి అగ్నివేశ్‌, అరవింద్‌ కేజ్రివాల్‌ ఆమరణ నిరాహారదీక్షను ఢిల్లిdలోనే ప్రారంభించాలని సూచించారని తెలిపారు. సంయుక్త కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటు వ ర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. ఈ బిల్లు త్వరగా అమోదం పొందేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను కోరుతున్నారా అని ప్రశ్నించగా, అటువంటిదేమీ అవసరం లేదని అన్నారు. అది ప్రభుత్వానికి అదనపు వ్యయంగా పరిణమించగలదని తెలిపారు.
నిపుణులు కావాలి, వ్యక్తులు కాదు: సంయుక్త కమిటీలో శాంతి భూషణ్‌ అతని కుమారుడు, ప్రశాంత్‌ భూషణ్‌లకు స్థానం కల్పించడం పట్ల యోగా గురు రామ్‌దేవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలపై స్పందిస్తూ, ప్ర స్తుతం కమిటీలో పటిష్టమైన బిల్లును రూపొందించగల నిపుణులు కావాలని, దీనికి మునుముందు లోక్‌పాల్‌ కమిటీ ఏర్పడినపుడు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. దీనిలో ఎవరు ఉండాలి, ఎవరు బయట ఉండాలి అన్నది ముఖ్యం కాదని అన్నారు. 'నాపై ఎటువంటి ఆరోపణలైనా చేయవచ్చు, నేను గాంధేయవాద సిద్ధాంతాలను పాటించేవాడిని. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒక కమిటీలో ఉండడంలో తప్పేమీ లేదు. మనకు అనుభవం, నైపుణ్యం కావాలి' అని ఆయన అన్నారు. 'కమిటీలో చేర్చిన వారికి న్యాయ శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని దృష్ట్టిలో ఉంచుకుని చేర్చాం.ఇటువంటి ఆరోప ణలు చేయవద్దని నేను బాబా కాళ్లను తాకి కోరగలను' అని హజారెె అన్నారు. పదవీ విరమణ చేసిన ఐపిఎస్‌ అధికారి కిరణ్‌ బేడీని కమిటీలో ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు కూడా ఆయన ఇదే సమాధానం చెప్పారు. ఈ ఉద్యమంలో చేరిన రామ్‌ దేవ్‌ ఈ కమిటీలో తండ్రి కుమారులకు స్థానం కల్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇందులో బంధుప్రీతి ఎందుకని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.
వెనక్కు తగ్గిన బాబా రామ్‌దేవ్‌: లోక్‌పాల్‌ బిల్లు రూపకల్పన కోసం కొత్తగా ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ బంధు ప్రీతితో కూడి వుందన్న అభ్యంతరాలను వ్యక్తం చేసిన యోగా గురు బాబా రామ్‌దేవ్‌ ఒకింత వెనక్కు తగ్గారు. న్యాయవాదులు శాంతిభూషణ్‌, ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌ కమిటీలో సభ్యులుగా ఉండడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రామ్‌ దేవ్‌ ప్రకటించారు. ''బంధు ప్రీతి అన్న దానిని లేవనెత్తింది మీడియానే తప్ప నేను కాదు. దీని గురించి నన్ను అడిగినప్పుడు లోక్‌పాల్‌ బిల్లు కోసం జరిగిన ఆందోళనలో మేం పాల్గొన్నప్పటికీ కమిటీ నియామకంలో మాత్రం మా ప్రమేయం లేకుండా పోయింది అని మాత్రమే అన్నాను'' అని రామ్‌ దేవ్‌ చెప్పారు. ''కమిటీలో శాంతి భూషణ్‌నూ, ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌నూ చేర్చడంపట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ''దీనిపై అన్నాజీ (అన్నా హజారే) తీసుకునే నిర్ణయం విషయంలో మాకు పూర్తి నమ్మకం వుంది.
కిరణ్‌ బేడీ కమిటీలో సభ్యురాలుగా ఉండాలని వలంటీర్లు కోరుకుంటున్నారని మాత్రమే నేను చెప్పాను'' అని రామ్‌దేవ్‌ వివరించారు. కమిటీలో సభ్యురాలిగా ఉండేందుకు మాజీ ఐపిఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ విముఖత తెలుపుతూ నిపుణులు మాత్రమే సభ్యులుగా ఉండాలన్నారు. ''ఇది 'ఎ' - ప్లస్‌ టీమ్‌. ప్రభుత్వ పనితీరు బాగా తెలిసినవారు, భారీ ఎత్తున ఉన్న అవినీతిపై పోరాటానికి సంబంధించి అన్ని కోణాలూ తెలిసినవారూ మాత్రమే ఇలాంటి కమిటీలలో సభ్యులగా ఉండాలి'' అని బేడీ అన్నారు.

No comments:

Post a Comment