వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలకు ఒకటే సరదా. అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్ళేవాళ్ళు కొందరైతే, మరికొందరు నగరాలలో స్విమ్మింగ్ పూల్స్, సమ్మర్ క్యాంప్స్‌లో కాలం గడుపుతారు. వేసవి ఎండలు ముదురు తుంటే గ్రామాలలో ముంజికాయ బండ్లు, చెరువుదగ్గర ఆటలు, చెరువులో స్నానాలు ఓ పక్కఅయితే, నగరాలలో ఐస్‌క్రీంలు తినడం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఓ రివాజుగా మారింది. ఇక ఎండలకు తాళలేక, ముంజెలు, కొబ్బరి బోండాలు, చెరుకురసం, నిమ్మరసం, మామిడిపళ్ళ రసం మొదలైనవి లాగిస్తుంటారు.
రాను రాను, నగరాలలో సమ్మర్ క్యాంప్స్ పేరిట సమయం వృధా పోకుండా అనేక సంస్థలు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు రూపొందించాయి. సమ్మర్‌లో ఏ మాత్రం బోర్ కొట్టకుండా వారికి మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి. హైదరాబాద్‌లోని వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సరళిని పరిశీలిద్దాం.
బాలవికాస్, మల్లికార్జున నగర్:
గోపాల్ నగర్‌లో నివాసముంటున్న ఉమ ఎస్‌బిఐలో సీనియర్ ఉద్యోగిని. ఆమె కేవలం వేసవిలోనే కాక సంవత్సర మంతా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలవికాస్ తరగతులను పిల్లలకు నిర్వహిస్తారు. దీనిలో వేద పఠనం, శ్లోకాలు, గీత పంచతంత్ర కథలు ఇత్యాదివి నేర్పుతూ నేటి బాలల్ని రేపటి ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ట్రెజర్ హౌస్:
హాస్య కవితలు, పబ్లిక స్పీకింగ్, సైంటిఫిక క్రాఫ్ట్, యోగా, తరగ తుల ద్వారా మానసిక వికాసానికి, శారీరక వికాసానికి తోడ్పడుతున్నారు.
దివ్య ఇన్‌స్టిట్యూట్, కొంపల్లి:
సమ్మర్ క్యాంపులో పెయింటింగ్, వాటర్ కలర్స్, డ్రాయింగ్, స్కెచింగ్ నేర్పిస్తారు. ఏప్రిల్ 17 నుండి మే 17 వరకు చిత్రకళలో విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
ఇస్కాన్, సికిందరాబాద్:
ఇక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలను ఎంతో సులభంగా ఆలపించే విధంగా తర్ఫీదునిస్తారు. అంతేకాక వారి మానసిక ఉన్నతికి కాలానికను గుణంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.
కిట్స్ జోన్, గాంధీ నగర్‌్:
ఇక్కడ డాన్స్, మ్యూజిక, క్రాఫ్ట్స్, గ్లాస్ డిజిటల్ పెయింటింగ్‌లో తరగతులను మే 4 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు.
ఆల్ సైన్స్ హైస్కూల్, అబిడ్స్:
ఇక్కడ ఫుట్‌బాల్ తరగతులను 5 సంవత్సరాలనుండి 17 సంవత్స రాల పిల్లలకు ఏప్రిల్ 17 నుండి మే 20 వరకు నిర్వహించనున్నారు.
కళానిధి ఇన్‌స్టిట్యూట్, మారేడ్ పల్లి:
ఇక్కడ గిటార్, పియానో, ఫ్లూట్, కర్ణాటక సంగీతంను, సాయంకాలం 4 నుండి రాత్రి 9 వరకు నిర్వహించనున్నారు.
మామ్ అండ్ మి:
హైదరాబాద్ నగరంలోని ఆంధ్ర మహిళా సభ 'మామ్ అండ్ మి' సంస్థ ద్వారా ఏప్రిల్ 18 నుండి పిల్లలకు వేదగణితం, తోలుబొమ్మలాట, డ్రాయింగ్, పెయింటింగ్, నగల తయారీ, క్రాఫ్ట్, చేతివ్రాత, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కుండపై పెయింటింగ్, గ్లాస్‌పెయింటింగ్, ఇంగ్లీష్ బోధన నేర్పనున్నారని పోగ్రామ్ కో- ఆర్డినేటర్ స్వర్ణ దుర్గ తెలియజేశారు.
బెంగుళూరు
బెంగుళూరులో చిన్నార చావిడి:
ఈ సంస్థ మే 1నుండి 15 వరకు ఉదయం 9 నుండి సాయంకాలం 4.30 వరకు వాయిస్ కల్చర్, బాడీ లాంగ్వేజ్, పాటలు, డాన్స్, డ్రాయింగ్, బాలకవుల సమ్మేళనం నిర్వహించనున్నారు.
కిండర్ డాన్స్:
ఈ సంస్థ 2 సంవత్సరాలనుండి 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు ఫిట్‌నెస్, డాన్స్, జిమ్నాస్టిక్స, బాడీ ఎవేర్‌నెస్ తదితర వినూత్న కార్యక్రమాలను రూపొందించారు.
ఐ-లీప్ అకాడమి:
ఈ సంస్థ ఏప్రిల్ 11 నుండి 16 వరకు పిల్లలకు ప్రకృతిని ఎలా ఆస్వాదించాలో వర్క్‌షాపులను నిర్వహించనున్నారు. మైక్రోస్కోప్ ద్వారా ప్రకృతి రహస్యాలను సైన్స్‌తో జోడించి అందజేయనున్నారు.
లాంచ్ పాడ్:
ఈ సంస్థ 5 సంవత్సరాలనుండి 10 సంవత్సరాల పిల్లలకు ఏప్రిల్ 29 వరకు సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నది.
జి-లెర్న్:
ఈ సంస్థ 3 నుండి 15 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి రోబో టెక వర్క్‌షాపును నిర్వహించనుంది. దీని కారణంగా విద్యార్థులు గణితంలోనూ, సైన్స్‌లోనూవారి ప్రతిభ మరింత రాణిస్తుంది. వీరికి రోబోకిట్ ఇచ్చివారితో రోబోలను తయారుచేయిస్తారు.
జి-స్కూల్:
కిడ్‌జీ, మౌంట్ లిటరా జి స్కూల్‌తో కలిసి ఫ్రీ స్టెయిల్ డాన్స్‌ను నిర్వహించనున్నారు.
లతాస్ క్రియేటివిటీ:
పిల్లలకే కాక పెద్దలకు కూడా గిఫ్ట్ ప్యాకుల తయారీ, చాకలెేట్ల తయారీ, డెకరేటివ్ ప్యాకింగ్, క్రిస్టల్, గ్లాస్ పెయింటింగ్, గ్రీటింగ్ కార్డ్ తయారీ, పాట్ డెకరేషన్‌లో తరగతులను నిర్వహించనున్నారు.
గార్డెన్ గుషప్స్:
నేత, బొమ్మల తయారీ, బ్యాగుల తయారీలో పిల్లలకు తర్ఫీదునిస్తారు.
వేసవి కాలాన్ని వృధా చేయకుండా ప్రతిభకు పదును పెడితే పిల్లలు బాగా రాణిస్తారు. అయితే, చాలా సంస్థలు సమ్మర్ క్యాంపులకు రుసుం(ఫీజు) వసూలు చేస్తున్నాయి. ఆ సంస్థలు మధ్యతరగతి, దిగువ తరగతి విద్యార్థులను దృష్టిలో వుంచుకుని ఫీజులు వారికి అందు బాటులో ఉండేటట్లు చూడాలి. వేసవి దాటిందంటే మళ్ళీ స్కూలు ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు ఇబ్బందే! బాలవికాస్ లాంటి సంస్థలను మిగతా సంస్థలు ఆదర్శంగా తీసుకొంటే మంచిది. నేడు డాన్స్ బేబీ డాన్స్ తదితర కార్య క్రమాలు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తు న్నాయి. వీటివైపు ప్రధానంగా దృష్టి మళ్ళించకుండా, వారు చదువుల్లో, మానసికంగానూ, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు యోగాను ఎంపిక చేసుకో వాలి. విద్యార్థులను సెలవుల్లో ప్రయోజ నాత్మక సమ్మర్ క్యాంపులవైపు మళ్ళిస్తే , అవి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుంది.
No comments:
Post a Comment