Sunday, April 10, 2011

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం


  • ద్రవపు ఉక్కు నేలపాలు 
  • రూ.100 నుంచి రూ.150 కోట్ల నష్టం
విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కీలకమైన విభాగంలో సాంకేతిక లోపం కారణంగా ద్రవపు ఉక్కు నేలపాలైంది. ద్రవపు ఉక్కు పడి యంత్రపరికరాలు పని చేయకుండాపోయాయి. దాంతో ఆ విభాగంలో ఉత్పత్తి నిలిచిపోయింది. రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలోని కంటిన్యువస్‌ కాస్టింగ్‌ డిపార్ట్‌మెంట్‌ (సిసిడి)లో లాడిల్‌కు చెందిన స్లైడ్‌గేట్‌ బ్రేక్‌ డౌన్‌ అయి ఒక్కసారిగా లాడిల్‌లోని ద్రవపు ఉక్కు బయటకు తన్నుకువచ్చింది. సిసిడి సెక్షన్‌లో మిషన్‌ 2 నుంచి వెళుతున్న ఈ లాడిల్‌కు రంధ్రం పడి అందులోని ద్రవపు ఉక్కు మొత్తం నేలపాలైంది. ఆ సమయంలో దిగువన కార్మికులెవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ద్రవపు ఉక్కు పడి బెడ్‌, ఎలక్ట్రికల్‌ కేబుల్‌, పిఎల్‌సి సిస్టమ్‌, మరికొన్ని యంత్రపరికరాలు పనికిరాకుండాపోయాయి. అయితే ఈ సంఘటన వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని, ఉత్పత్తకి ఎటువంటి విఘాతమూ
కలగలేదని ప్లాంట్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత ఇతర కాస్టర్లు ద్రవపు ఉక్కును తీసుకెళ్లాయని పేర్కొన్నారు. నాసిరకమైన మెటీరి యల్‌ వాడుతున్నందునే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతు న్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment