Saturday, April 16, 2011

అట్టహాసంగా జగన్‌ నామినేషన్‌


కడప: ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌లను దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వైఎస్‌ జగన్‌ తన తల్లి విజయమ్మ, కుటుంబసభ్యులతో నామినేషన్‌ పత్రాలను తీసుకొని ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద వుంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ సతీమణి విజయమ్మ వైఎస్‌ ను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యం అభిమానులను కలిచివేసింది. కుమార్తె షర్మిళ తల్లిని ఓదార్చింది. అనంతరం జగన్‌ తన అనుచరులతో కలెక్టరేట్‌ చేరుకొని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశిభూషణ్‌ కుమార్‌కు ఆయన రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌ చేరుకున్న జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. సరిగ్గా 10.45నిముషాలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టర్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. 10.46నిముషాలకు నామినేషన్‌ సెట్‌పై సంతకాలు చేశారు. 11.04నిముషాలకు మొదటి నామినేషన్‌ సెట్‌ను, రెండవ నామినేషన్‌ సెట్‌ను 11.22 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా జగన్‌ వెంట మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అడ్వకేట్‌ పుల్లారెడ్డి వున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జగన్‌కు మద్ధతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. వీరిలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మారెప్ప, నెల్లూరు మేకపాటి బ్రదర్స్‌ రాజమోహన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సినీ నటి రోజా తదితరులు వున్నారు. జగన్‌ నామినేషన్‌ వేస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే ఉదయం నుండే పోలీసులు పెద్దఎత్తున కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. కలెక్టరేట్‌ నలుమూలల ను పోలీసులు దిగ్భంధనం చేశారు. సెవెన్‌రోడ్స్‌ సర్కిల్‌లోని సిండికేట్‌ బ్యాంకు సమీపంలోనే కార్యకర్తలను, అభిమానులను పోలీసులు నిలిపివేశారు.
వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అదేవిధంగా ముందుగానే కలెక్టరేట్‌ గేటు ముందుకు చేరుకున్న అభిమానులను ప్రధాన గేటు వరకు రాకుండా అఢ్డగించారు. కేవలం గుర్తింపు కార్డులు వున్న కలెక్టరేట్‌ ఉద్యోగులను, మీడియాను మాత్రమేపకార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది. కార్యకర్తలను లోపలకు వెళ్లకుండా పోలీసులు బలప్రయోగం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ నాయకులు కూడా పపవుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐదవరోజు ఎంపీ స్థానానికి 6, అసెంబ్లిdకి ఒక నామినేషన్‌
ఉప ఎన్నికలలో నామినేషన్‌ల పర్వంలో 5వరోజు కడప ఎంపీ స్థానానికి ఆరు నామినేషన్‌లు, పులివెందుల స్థానానికి ఒక నామినేషన్‌లు దాఖలయ్యాయి. కడప ఎంపీ స్థానానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున దాఖలు చేశారు. అలాగే చిలకలపల్లి జగన్‌ మోహన్‌ రెడ్డి, తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన కె.పద్మనరాజు, జిల్లాకు చెందిన కె.శ్రీనివాసులు రెడ్డి, పెనుబాల విజయ్‌కుమార్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్‌లను దాఖ లు చేశారు. అలాగే పులివెందుల అసెంబ్లిd స్థానానికి విజయలక్ష్మీ అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్‌ పత్రాన్ని దాఖల ు చేశారు.

No comments:

Post a Comment