Friday, April 15, 2011

ఊబకాయంతో ప్రపంచ రికార్డు కోసం..

వాషింగ్టన్‌: ఊబకాయంలో ప్రపంచ రికార్డుని సాధించాలన్న లక్ష్యంతో న్యూజెర్సీ ఓల్డ్‌ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన డొన్నా సింప్సన్‌ అనే 44 ఏళ్ళ మహిళ తెగతినేస్తున్నారట. ఆమె ప్రస్తుతం 72 కిలోల బరువు ఉన్నారు. ఆమె రోజుకు 12000 కాలరీల ఆహారం తీసుకుంటారు. తన తొలి భర్త ప్రోత్సహంతో అతిగా తినడం అలవాటు చేసుకున్నానని ఆమె చెప్పారు. డేవిన్‌ అనే కుమారునికి జన్మ నిచ్చిన తరువాత తన మొదటి భర్తకు ఆమె విడాకులు ఇచ్చారు. ఆమె తిండి తగ్గించి కాయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించినప్పుడు గ్యాస్ట్రిక్‌ శస్త్ర చికిత్స చేయించుకోవలసి వచ్చిందట,దాంతో ఆమె ఆ ఆలోచనను విరమించుకుని తిరిగి అతితిండిని ప్రారంభించారు. ఆమె 2006లో ఒక బాయ్‌ ఫ్రెండ్‌తో పరిచయం అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు వారికి జాక్విలిన్‌ అనే కుమార్తె పుట్టింది. ఈ ప్రసవాన్ని 19 మంది డాక్టర్లు పర్యవేక్షించారు. 2007 ఫిబ్రవరిలో ఆమె రెండవ కాన్పులో శస్త్రచికిత్స జరిగింది. అప్పటికి ఆమె ప్రపంచంలో గరిష్ట బరువు గల తల్లులలో మూడవ వ్యక్తిగా ఎంపిక అయ్యారు.

No comments:

Post a Comment