ఉపఖండంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంరంభం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సెమీస్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించిన భారత పులులు ఫైనల్లో లంక సింహాలను కూడా మట్టి కరిపించాలని 121 కోట్ల జన భారతం 'చక్ దే విన్‌డియా' అని నినదిస్తోంది. మరోపక్క ధోనీసేనే ఫేవరెట్లను ఒప్పుకుంటూనే, మా అవకాశాన్ని కూడా అంత తేలిగ్గా వదులుకునేది లేదని లంక కెప్టెన్ స్పష్టం చేశాడు. కప్ సాధించి శ్రీలంక క్రికెట్ తావూ మురళీధరన్‌ను సత్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స సంగక్కర సేనకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ గెలిచి సచిన్ చేతుల్లో పెడతామని ధోనీ సేన అంటుంటే, కప్ సాధిస్తుందని ఆశాభావంతో ఉన్నానని ప్రధాని మన్మోహన్ అన్నారు. కపిల్‌సేనలోని బిన్నీ, జిమ్మీలను స్ఫూర్తిగా తీసుకోవాలని 'మాజీ'లు కోరుతున్నారు. 1983ని మళ్లిd పునరావృతం చేయాలని దేశవ్యాప్తంగా యాగాలు, పూజలు జరుగుతున్నాయి. మొత్తంమీద ఉపఖండం క్రికెట్‌ను శ్వాసిస్తోంది. మరోపక్క దేశవ్యాప్తంగా ఉగ్రవాద ముష్కర మూకలు దాడులకు పాల్పడవచ్చునని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించగా, ముంబైలోని వాంఖేడ్ స్టేడియంకు బహుల అంచల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
No comments:
Post a Comment