కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి.. గత నాలుగు రోజులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారశైలిపై పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా అధ్యక్ష పదవికి ఉమా రాజీనామా చేయటం, వంశీమోహన్ జిల్లా పార్టీ కార్యాలయంలోనే మీడియా ఎదుట మరోసారి ఉమా వ్యవహారశైలిని తూర్పారపట్టడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో గ్రూపుల పోరు తారస్థాయికి చేరింది. జిల్లాలో మూడు గ్రూపుల మధ్య అనాదిగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దేవినేని ఉమా, కొడాలి నాని, గద్దే రామ్మోహనరావు వర్గాలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించకపోగా గ్రూపు తగాదాలతో రోడ్డెక్కటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
గతంలో అనేక సందర్భాలలో పార్టీశ్రేణుల మధ్య బాబు సమన్వయం కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయినా ఆధిపత్యపోరు నివురుగప్పిన నిప్పులా రగులుకుంటోంది. తాజాగా నందమూరి హరికృష్ణ జిల్లా పర్యటనతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హరికృష్ణ జిల్లాలో ఉంటే దేవినేని శాసనసభ సమావేశాలంటూ రాజధానిలో కూర్చుని అవమానపరిచారని వంశీ ఆరోపిస్తుండగా, గుంటూరు జిల్లా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన హరికృష్ణ విజయవాడలో బస చేశారని ఉమా వర్గం వాదిస్తోంది. టిడిపి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఉమ కార్యకర్తల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవటంలేదని, తన సోదరుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో లోపాయకారీగా వ్యవహరిస్తున్నందున ఆయన నాయకత్వంలో పనిచేయలేమని వంశీ స్పష్టం చేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టిడిపి జిల్లా రాజకీయం వేడెక్కింది. నెహ్రూ వర్గీయులు టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉమా ఖండించక పోవటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
దేవినేని కుటుంబీకులు అన్ని పార్టీలలో పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారని వంశీ ధ్వజమెత్తారు. దివంగతనేత ఎన్టీఆర్ భిక్షతో పదవులను అనుభవిస్తూ ఆయన కుటుంబ గౌరవానికి భంగం కలిగించే రీతిన ఉమా వ్యవహరించటాన్ని తాము జీర్ణించుకోలేక రాజీనామాకు సిద్ధపడినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా వంశీకి ఆప్తమిత్రుడైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలసి జగన్ గూటికి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వదంతులు వినవస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను వంశీ కొట్టిపారేస్తున్నా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. తాను ముమ్మాటికీ నందమూరి కుటుంబానికి విధేయుడుగా పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమా కృషి వల్లే జిల్లాలో పార్టీ పట్టు నిలుపుకుందని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. కొందరు స్వార్ధ ప్రయోజనాలతో తనపై అసత్య ఆరోపణలకు దిగుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా వంశీ ఆరోపణలపై స్పందించారు. నందమూరి వంశస్తులంటే తమకు అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయని, అయితే అవమానం జరిగిందనే అభూత కల్పనలు సమంజసం కాదన్నారు. వ్యక్తిగత విద్వేషాలను నందమూరి కుటుంబానికి ఆపాదించటం తగదన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో రగులుతున్న ఈ విభేదాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీశారు. వ్యక్తిగత విమర్శలతో పార్టీని బజారుకెక్కిస్తే ఉపేక్షించేదిలేదని ఇరువర్గాలను మందలించారని సమాచారం.

No comments:
Post a Comment