ఆబాలిక పేరు అన్నై రుక్కర్. ఆ చిన్నారి చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాటలలో వర్ణించలేనివి. మరికొద్ది క్షణా ల్లో మృత్యువాత పడనున్న చిన్నారి ముద్దుల చెల్లి కామ్రిని మెరుపువేగంతో కాపాడి, తాను తీవ్రగాయాలపాలైంది.
కళ్ళముందే ఆక్సిడెంట్ రూపంలో మృత్యువు తన చిన్నారి చెల్లెల్ని, ట్రక్కు రూపంలో కబళించబోవడాన్ని ఆకలించుకో లేకపోయింది. తన కళ్ళెదుటే, చెల్లి కామ్రి ప్రాణాల్ని కోల్పోతుండడం చూడలేకపోయింది. తనకేమయినా ఫర్వాలేదు, చెల్లి బ్రతకాలి, అను కుంటూ రెండో ఆలోచనకు తావీయకుండా, ఒక్క ఉదుటున దూకి, తన శక్తినంతా ఉపయో గించి, వేగంగా దూసుకువస్తోన్న ట్రక్కుకెదురుగా వున్న చెల్లెల్ని ప్రక్కకు తోసేసింది. కానీ తాను మాత్రం, ట్రక్కు ఢ కొట్టడం వలన తీవ్ర గాయా లపాలైంది. ఈ యాక్సిడెంట్‌లో అన్నై రుక్కర్ రెండు కాళ్ళూ విరిగిపోయాయి, మెడ విరిగింది, వెన్నెముకతోబాటు, కిడ్నీ కూడా దెబ్బతినింది. అయినా ఆ బాలికలో చెల్లెల్ని కాపాడానన్న సంతృప్తి ఉంది.
ఆరోజు 2011, ఫిబ్రవరి 4వ తేదీ. ఆ ఉదయం రుక్కర్ ఇంటిల్లిపాదికీ భయానకమైన దినం. ఎందుకంటే, తొమ్మిదేళ్ళ అన్నైరుక్కర్, అయి దేళ్ళ కామ్రి అనే అక్కచెల్లెళ్ళు ఆ రోజు ఉదయమే బ్రేకఫాేస్ట్ చేసి స్కూలుకని బయ లుదేరి వెళ్ళారు మేడమీది బాల్కనీలో ఉన్న మమ్మీకి టాటా చెబుతూ... తమ ఇంటికి ఎదురుగా, రోడ్డుకు అవతలనున్న బస్టాప్ దగ్గరకు నడుస్తూ వెళ్తున్నారు ఆ చిన్నారులిద్దరూ. మధ్య మధ్యలో తల వెనక్కి తిప్పి తల్లికి టాటా చెబుతూన్నారు. తల్లి మేడమీది బాల్కనీలోంచే చిన్నారులిద్దరినీ గమనిస్తోంది.
ఇంతలో కుండపోతగా వర్షం మొదలైంది. వర్షం వల్ల తడవకుండా ఇద్దరూ రెయిన్‌కోటును తలభాగానికి చుట్టుకొని బటన్స్ పెట్టుకున్నారు. చిన్నారులిద్దరూ, నిండుగా రైయిన్‌కోటును ధరించడాన్ని చూసి వారి తల్లి తృప్తిగా నిట్టూర్చి లోనికెళ్ళింది.
తలభాగంలో రెయిన్‌కోటు ఉండడం వల్ల రోడ్డుపై వచ్చే వాహనాలను గమనించలేకపోయారు ఆ పసిపిల్లలు. అత్యంత వేగంగా తమవైపో ట్రక్కు వస్తున్న సంగతిని గుర్తించని ఆ చిన్నారులు, రోడ్డుకవతల ఉన్న బస్‌స్టాప్‌ను త్వరగా చేరుకోవాలని వడివడిగా నడుస్తున్నారు.
చెల్లి కామ్రి ముందు నడుస్తోంది. తాను చెల్లి వెనకనే నడుస్తోంది. ఇంతలో ఓరకంట తమకు అత్యం త సమీపంలో వేగంగా ఓ ట్రక్కు రావడాన్ని గమనిం చింది అన్నై రుక్కర్. సరిగ్గా ఆ ట్రక్కు తన చెల్లి కామ్రికి కొద్ది గజాల దూరంలోఉంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయలేదు అన్నై. వెంటనే ఒక్క అంగలో ముందుకురికి చెల్లిని బలంగా అవతలకు నెట్టేసింది. అక్క తననెందుకు నెట్టిందా అని ఆలోచిస్తున్న కామ్రికి 'ధడేల్' మన్న శబ్ధానికి వెనుతిరిగి చూసింది. ఓ ట్రక్కు అతివేగంగా వచ్చి తన అక్కను ఢకొీందని గ్రహించింది కామ్రి. వేగం గా ట్రక్కు ఢ కొట్టడం వల్ల అక్కడే కుప్పకూలిపోయింది అన్నై రుక్కర్.
ఊపిరి ఆడడంలేదు. ట్రక్కు ఓ బాలికను ఢకొీని వెళ్ళిపోవడాన్ని లోరెట్టా బెర్రిమన్ అనే ఓ బస్సు డ్రైవర్ చూశాడు. పరుగు పరుగున వచ్చి అక్క చెల్లెల్నిద్దర్నీ చూశాడు. వెంటనే తనకు తెలిసిన ప్రాథ మిక చికిత్స చేసి, హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి వైద్య నిపుణులు అత్యవసర వైద్యసేవలందించి, కామ్రికి మేజర్ ఆక్సిడెంట్ తప్పిందనీ, భయపడాల్సిన అవసరం లేదనీ తేల్చేశారు కానీ, ఆ బాలిక అక్క రుక్కర్ పరిస్థితి కొన్ని గంటలు గడిస్తేగానీ ఏ విషయాన్నీ చెప్పలేమ న్నారు. ఆమె కాళ్ళు రెండూ విరిగి పోయాయనీ, మెడ భాగంలో కూడా తీవ్రగాయాలయ్యాయనీ, కిడ్నీ, వెన్నె ముక ఈ ప్రమాదంలో బాగా దెబ్బతిన్నాయని నిర్ధా రించారు.
పది గంటలపాటు సర్జన్లు శ్రమించి రుక్కర్ ప్రాణాల్ని కాపాడగలిగారు. కొద్దిసేపు ఆలస్యమయ్యుంటే ఆ బాలికను బ్రతికించలేకపోయేవారమని పేర్కొన్నారు. నెలరోజులపాటు ఆ బాలికను తమ పర్యవేక్షణలో ఉం చుకుని కొంచెం నయమయ్యాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. నానా ప్రయాసలు పడి ఆ బాలిక కుడికాలునీ, మెడనీ సరిచేశారు.
దాదాపునెలరోజుల తర్వాత అన్నై రుక్కర్ హాస్పి టల్ నుంచి డిశ్చార్జి అయి, ఇంటికి రాగానే మేడిసన్ నివాసితులూ, ఆ చిన్నారి చదివే స్కూలు పిల్లలందరూ హార్థిక స్వాగతం పలికారు రుక్కర్‌కు.
ఈ బాలిక చూపిన తెగువనూ, ధైర్యసాహసాలను అక్కడి ఛానల్స్, వార్తలను ప్రసారం చేశాయి. ఇంట ర్య్యూలు తీసుకున్నాయి. ఇంతటి ధైర్యసాహసాలు ఎలా చూపించావు, ప్రాణాలకు సైతం ఎందుకు తెగించావు అని రుక్కర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నేను నా చెల్లిని రక్షించుకోవాలనుకున్నాను తప్ప నాకు ఇంకేం తెలీదు అంటుంది ఆ బాలిక అమాయకంగా.
చూశారా బాలలూ! ప్రాణాలకు సైతం తెగించి, రుక్కర్ తన చెల్లెల్ని ఎలా కాపాడుకుందో!ఎంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించిందో..!
No comments:
Post a Comment