Thursday, April 14, 2011

నీ సాహసం స్ఫూర్తిమంతం చెల్లీ! దోపిడీదారులను ఎదిరించిన ధీర

తోపులాటలో కాలు పోగొట్టుకున్న నేషనల్‌ అథ్లెట్‌
న్యూఢిల్లీ : జాతీయ స్థాయి అథ్లెటిక్‌ (వాలీబాల్‌ క్రీడాకారిణి) సోనూసిన్హా(23) రైలులో ప్రయాణిస్తుండగా దోపిడీదొంగలు విరుచుకుపడ్డారు. వారిని దీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆ అథ్లెటిక్‌ను దోపిడీదొంగలు రైలులో నుంచి తోసివేశారు. దీంతో ఆమె పక్కనే వున్న రైలు పట్టాలపై పడింది. ఎడమకాలును పోగొట్టుకుంది. ఈ ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన సోనూసిన్హా(23) వాలీబాల్‌ క్రీడాకారిణి. ఉత్తరప్రదేశ్‌ జట్టు తరఫున పలు జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నోయిడాలో నిర్వహిస్తున్న సిఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి ఫైజాబాద్‌ నుంచి నోయిడాకు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తోంది. రైలులో దోపిడీకి పాల్పడుతున్న దుండగులను అడ్డుకోవడానికి సోనూసిన్హా ప్రయత్నించింది. దుండగులు ఆమెను నడుస్తున్న రైలులో నుంచి తోసివేశారు. పక్కనే వున్న పట్టాలపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె కుడికాలు పూర్తిగా కోల్పోయింది. పట్టాలపై గాయపడి వున్న ఆమెను బరేలీ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైల్వే అడిషనల్‌ డిజి ఎకె జైన్‌ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి తమకెవ్వరూ (రైల్వే పోలీసులు) ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆ రైలులో దోపిడీకి ప్రయత్నించారని ఘటనను జైన్‌ తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గుండా దాదాపు 764 రైళ్లు నడుస్తున్నాయని, సిబ్బంది కొరతతో రైళ్లలో రక్షణచర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. రైల్వే పోలీసులకెవరూ సమాచారమివ్వలేదు. ఆ రైలులో ఆ ఘటన జరిగిన సమయంలో జిఆర్‌పి సిబ్బంది ఎవరూ లేరు, తాము రైల్వేశాఖ అధికారులతో మాట్లాడుతున్నాం, మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్నట్లు సోనూసిన్హాను గుర్తించారు. ఆమె పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తోంది. ఆ కంపార్ట్‌మెంట్‌లో కొంతమంది ఘర్షణ పడుతుండగా ఆమె చూసింది. ఆమె ఓ బంగారు గొలుసు మెడలో వేసుకొని వుంది. ఆ రైలులో అక్కడ ఎలాంటి దోపిడీ జరుగలేదు. వాస్తవంగా అక్కడేమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ బాలిక చెబుతున్నదే తాము నమ్ముతున్నాం’’ అని జైన్‌ వివరించారు.

No comments:

Post a Comment