సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం ఏశ ప్రగతి అయినా, ఆ దేశంలోని యువకుల ప్రతిభా సామర్ధ్యాలు, శక్తియుక్తులపైనే ఆధార పడి ఉంటుందంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తరచు చేసే ప్రకటనలు మన కన్నా విదేశీయులనే ఎక్కువ ప్రభావితం చేస్తున్నా యేమోననిపిస్తోంది.యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి పొజటివ్ యూత్ డవలెప్ మెంట్ (పివైడి) పేరిట వివిధ రంగాల్లో యు వతను ప్రోత్సహించే కార్యక్రమం అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇప్పుడు అమలు జేస్తు న్నారు. యువకుల మనోభావాలను గ్రహించి కట్టలు తెగిన ప్రవాహం వంటి వారి శక్తి సామర్ధ్యాలను ఏ విధంగా సమాజ కల్యాణా నికి ఉపయోగించుకోవాలో లోతైన అధ్యయనం చేసిన అనంతరం వివిధ కార్య క్రమాలను రూపొందిస్తున్నారు. విధాన నిర్ణ యాల్లోనూ, కొత్త విషయాలను కనుగొనడం లోనూ యువకులకు ప్రమేయం కల్పించడం జరుగుతోంది. ఈ విషయంలో భారతీయు లకు ఉన్న అంకితభావాన్నీ, పని మీద ఉండే శ్రద్ధాసక్తులను గ్రహించడం వల్లనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రభుత్వ యంత్రాం గంలో ప్రవాస భారతీయులు పెక్కు మందికి కీలకమైన పదవులను ఇచ్చారు. అమెరికాలో ఆరోగ్య, మానవ వనరుల మంత్రిత్వ శాఖలు యువజనాభ్యుదాయనికి సానుకూల వైఖరులను అనుసరిస్తున్నాయి. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే యువకుల్లో నిరాశానిస్పృహలు ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా, వారికి తీరిక లేకుండా చేయడం కోసం వివిధ రంగాల్లో వారికి శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగా వకాశాలు లభించేట్టు చేయడం, అందుకు తగిన రీతిలో వారికి సలహాలూ, సూచనలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
యువత సాధికారత
యువ సాధికారతకి ఇప్పుడు అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. తరాల మధ్య అంతరం లేకుండా చేయడానికి పాలనా వ్యవహారాల్లోనూ అనుభవజ్ఞులతో పాటు కొత్త రక్తానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి.సమస్యల పరిష్కారంలో యువత ఆలోచనలూ,అభిప్రాయాలను పంచుకోవడం, వాటికి మెరుగులు దిద్ది పాలనా వ్యవహారాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్నీ, చిత్తస్థయిర్యాన్నీ పెంపొందించడం వంటి కార్యక్రమాలను అప్పుడే వివిధ దేశాలు అమలులో పెట్టాయి. సాధారణ విద్యలోనే కాక, సాంకేతిక, వృత్తి విద్యల్లోనూ,ఇతర ఆధునిక శాస్త్ర,సాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఆయా రంగాలలో వారు నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కామన్వెల్త్‌లోని 53 దేశాలు 2007 నుంచి 2015 వరకూ కామన్వెల్త్ యాక్షన్ ప్లాన్ పేరిట ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యువ సాధికారత అంటే ఆయా రంగాల్లో యువకులు అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నీ, దన్నునూ ఇవ్వడం, యువత ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి. యువకులు తమ హక్కుల గురించే కాక, సమాజం పట్ల తమకు గల బాధ్యతలను గురించి తెలియజెప్పడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా వారిని తీర్చి దిద్దే కార్యక్రమాలను ఈ కార్యాచరణలో పొందుపర్చారు. అలాగే, వివిధ అంశాలకు సంబంధించి సవాళ్ళను ఎదుర్కొనేందుకు
యువతను సన్నద్ధం చేయడం కూడా ఈ ప్రణాళికలోని ముఖ్యాంశం. యువకుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించడం, హక్కులతో పాటు బాధ్యతలను మరవ రాదని వారికి తెలియజెప్పడం, అట్టడుగు స్థాయి నుంచి యువకులను సమీకరించి వారికి ఏయే రంగాల్లో ఆసక్తి ఉందో గ్రహించి ఆయా రంగాల్లో ప్రోత్సహించడం ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చడం జరిగింది. చైనా, యూ రప్,అమెరికా, తదితర దేశాల్లో యువజన సంస్థలు ప్రణాళికా బద్దంగా పని చేస్తున్నాయి. మానవ హక్కుల గురించి యువతకు సుబోధకం చేసేందుకు జర్మనీలో 2011లోనే యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వ ర్యంలో విద్యార్దినీ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు.బాల్యం నుంచే మానవ హక్కులపై అవగాహన పెంచేందుకు
చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్నది. అలాగే, వక్తృత్వ పటిమను పెంపొందించేందుకు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రాపంచిక, ప్రాదేశిక అంశాలపై అవగాహన పెంచడానికి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌లు ఇప్పుడు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. పదవ తరగతి లోపు విద్యార్ధులు కూడా ఇంటర్నెట్‌లో వివిధ సైట్‌లు చూడటానికి అలవాటు పడుతున్నారు. గతంలో మాదిరిగా తమ తలలను పుస్తకాల్లో కాకుండా ఇంటర్నెట్‌లో గంటల తరబడి పెడుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామే కానీ, అన్ని రంగాల్లో మాదిరిగా వ్యాపార ధోరణులు ఈ రంగంలోనూ ప్రవేశించడం వల్ల చెడు వైపు యువతను ఆకర్షించేందుకు జరిగే యత్నాలను అరికట్టడం, సైబర్ నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టాలను కట్టుదిట్టంగా అమలు జేయడం ప్రభుత్వాల బాధ్యత. అభివృద్ది, అవాంఛనీయ ధోరణులు నాణానికి రెండు పార్శ్వాలుగా ఎప్పుడూ ఉంటాయి. మంచి వైపు మాత్రమే మన పిల్లలను నడిపించాలి. అందుకు తగిన విధంగా విద్యా, శిక్షణ విధానాలు ఉండాలి. సాంకేతికాభివృద్ధి సమాజకల్యాణానికి తోడ్పడినప్పుడే అది సార్థకమైనట్టు.
No comments:
Post a Comment