తెలంగాణ జిల్లాలలో వెూహరింపునకు సన్నద్ధం
హైదరాబాద్: కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి మరో దఫా రానున్నాయి. ఈసారి 50 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించింది. తమిళనాడు, కేరళ, పాండిచ్ఛేరి రాష్ట్రాలలో అసెంబ్లిd ఎన్నికలు ముగిసిన తరువాత ఈ నెల
15వ తేదీన ఈ బలగాలు రాష్ట్రానికి పంపాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ బలగాలు తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా మొహరించేందుకు రాష్ట్ర హోం శాఖ సన్నాహాలు చేస్తోంది.
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో తొలిసారిగా కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చిన విషయం విదితమే. అప్పట్లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాలను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర పోలీసులకు తలకుమించిన భారం అవడంతో ఈ బలగాలను రంగంలో దించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పది వేల మంది కేంద్ర బలగాలకు తోడుగా మరో పది వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చాలా కాలం పాటు పహారా కాశారు. ఇందులో అత్యధికం తెలంగాణ జిల్లాలలోనే వుండడం విశేషం. అయితే ఆరు నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థి తులు కొంత కుదుట పడడంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన బలగాలను వెనక్కు పంపారు. మహా రాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పదివేల మంది పోలీసులు తిరిగి తమ సొంత ప్రాం తాలకు వెళ్లిపోయినప్పటికీ పారా మిలటరీ బలగాలు మాత్రం అలాగే వున్నాయి. నాలుగు నెలల క్రితం కేంద్ర బలగాలను కొంత తగ్గించారు. దీని తరువాత రాష్ట్రంలో 60 కంపెనీల బలగాలు పహా రాగా వున్నాయి. అయితే పక్షం రోజుల క్రితం తమిళనాడు, కేరళ, పాండిచ్ఛేరి రాష్ట్రాలలో జరిగే అసెంబ్లిd ఎన్నికల కోసమని రాష్ట్రంలో వున్న మొత్తం కేంద్ర బలగాలను ఈ మూడు రాష్ట్రాలకు పం పారు.
ఈ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో అక్కడి బలగాలను తిరిగి రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర హోం శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రం నుంచి వెళ్లిన మొత్తం 60 కంపెనీల బలగాలు తమకు కావాలని అడిగినప్పటికీ కేంద్రం 50 కంపెనీలను మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ బలగాలను ఈ నెల 15 వ తేదీన రాష్ట్రానికి పంపాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అనుకోని అవాంతరాలు ఎదురైతే తప్ప ఈ బలగాలు రాష్ట్రానికి రావడం ఖాయమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అత్యధిక బలగాలు తెలంగాణ జిల్లాలలో మొహరింపు: ఇదిలావుండగా రాష్ట్రానికి రానున్న 50 కంపెనీల కేంద్ర బలగాలలో అత్యధికం తెలంగాణ జిల్లాల లో మొహరించే అవకాశాలున్నాయి. మొత్తం ఆరున్నర వేల మంది పోలీసు సిబ్బందిలో నాలుగు వేల మంది వరకు ఈ జిల్లాలలో నియమించే వీలుందని సమాచారం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిసే ్త తెలంగాణ జిల్లాలలో తరచూ ఆందోళనలు జరుగుతుండడం, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ వర్సిటీతో పాటు ఇతర విశ్వవిద్యాలయాల వద్ద ఈ ఆందోళనలు మరింతగా వుండడంతో కేంద్ర బలగాలను ఈ ప్రాంతంలో ఎక్కువగా మొహరించే వీలుంది. తమ జిల్లాలకు మరిన్ని అదనపు బలగాలు కావాలని తెలంగాణ జిల్లాల ఎస్పీలు ఎప్పటి నుంచో కోరుతుండగా దీనికి సర్కారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మిగతా బలగాలను సీమాంధ్రలలో నియమించా లని హోం శాఖ నిర్ణయించింది.
No comments:
Post a Comment