Thursday, April 7, 2011

అందాల ఖైదీ


రియోడిజనీరో: బ్రెజిల్‌లోని ఒక జైలు ఇదే మొదటిసారిగా అందాల పోటీ జరిపింది. ఆ దేశంలోని పెర్నాంబుకో రాష్ట్రంలో ఉన్న రెకిఫ్‌ జైల్లో 19 ఏళ్ల రెబెక్కా ర్యాసా సులెన్‌ అనే అమ్మాయి ఖైదీలందరిలోకి అందగత్తెగా కిరీటం కొట్టేసింది. ఈ యువతి ప్రస్తుతం రెకిఫ్‌ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. హత్యానేరానికి ఆమెకి ఈ శిక్ష పడింది. బహుశా చూపులతో చంపేసిందేమో!
ఈ సందర్భంగా సహ ఖైదీలు, గార్డులు, రెబెక్కాను పొగడ్తలతో ముంచెత్తారు. అంత సంతోషంలోను ఆ పిల్లకి ఏకైక విచారమేమిటంటే అందాల పోటీలో ధరించిన డ్రస్‌ తిరిగి జైలుకు అప్పగించి ఖైదీ వేషంలో గడపాలని. వీరికి కూడా ఈ పోటీలో లోకజ్ఞానం గురించిన ప్రశ్నలు కూడా వేశారుట. మంచి ప్రవర్తన రికార్డును చూసి 12 మంది అమ్మాయిలను ఈ పోటీకి ఎంపిక చేశారు.

No comments:

Post a Comment