- డిసెంబర్‌లోగా మార్కెట్లోకి: యూరో గ్రూప్ ఎండి విశ్వప్రియా గిరి
హైదరాబాద్: ఈ సంవత్సరం ముగిసేలోగా 22 వేల రూపాయల ఖరీదులో 100 సిసి బైక్, లక్ష రూపాయల ఖరీదులో కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నామని యూరో గ్రూప్ ఎండి విశ్వప్రియా గిరి వ్యాఖ్యానించారు. ఎపి మార్కెట్లో యూరో మొబైల్, లాప్‌టాప్‌లను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డైరెక్ట్ మార్కెటింగ్ విధానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ కేవలం 1500 రూపాయలకు డ్యూయల్ సిమ్, కెమెరా సౌకర్యాలతో మొబైల్, 11 వేల రూపాయలకే లాప్‌టాప్‌లను అందిస్తోందని తెలిపారు. బైక్ గురించిన మరిన్ని వివరాలు అందించేందుకు నిరాకరించారు. గత సంవత్సరం సంస్థ ఆదాయం 30 కోట్ల రూపాయలుగా నమోదుకాగా, ఈ సంవత్సరం అది 100 కోట్ల రూపాయలను దాటుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో దాదాపు 80 వేల మంది సభ్యులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మరిన్ని శాఖలను ఏర్పాటు చేయనుందని వివరించారు. ఏప్రిల్‌లోగా శుద్ధమైన మంచినీరు, హెర్బల్ ఉత్పత్తులను విడుదల చేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ హెడ్ అమిత్ సిన్హా, రీజనల్ హెడ్ టి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment