మంచి ఫామ్‌లో వున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. గ్లామర్ హీరోయిన్‌గా ఆమెకు పేరున్నప్పటికీ, 'చందమామ', 'మగధీర' తదితర చిత్రాలు అభినయపరంగా కూడా కాజల్‌కు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ముంబాయికి చెందిన ఈ భామ తొలుత మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. అక్కడ 'క్యూన్ హో గయానా' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసి, తెలుగులో 'లక్ష్మీకల్యాణం' ద్వారా పరిచయమైంది. అయితే తొలి చిత్రమే అంతగా ఆడకపోయినా కాజల్ కెరీర్‌కు ఎంతమాత్రం ఇబ్బంది కలగలేదు. కృష్ణవంశీ 'చందమామ' చిత్రంతో ఒక్కసారిగా ఆమె పేరు పాపులర్ అయ్యింది. ఇక అక్కడి నుంచి జయాపజయాల సంగతి ఎలావున్నా కాజల్‌కు తిరుగులేకుండా పోయింది. 'పౌరుడు, ఆటాడిస్తా, గణష్, ఆర్య-2, గణష్, ఓంశాంతి' వంటి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించకపోయినా 'మగధీర, డార్లింగ్, బృందావనం' వంటి చిత్రాలు కాజల్‌కు మంచిక్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నాగచైతన్య వంటి పేరున్న హీరోల సరసన సినిమాలు చేసిన ఆమె ఓ పక్క తెలుగు చిత్రాలను చేస్తూనే మరోపక్క 'సరోజ, బొమ్మలాట్టం' వంటి పలు తమిళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో కామాక్షి కళామూవీస్ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో నాగచైతన్య సరసన, రవితేజ సరసన 'వీర'లోను, ప్రభాస్ సరసన 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లోను నటిస్తోంది. మరో విశేషమేమిటంటే...కెరీర్ మొదట్లో హిందీ చిత్రంలో నటించిన ఆమె దాదాపు ఆరేళ్ల అనంతరం ఇప్పుడు మళ్లీ హిందీలో 'సింగం' అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తంమీద తన కెరీర్ జోరు జోరుగా సాగిపోతున్నందుకు కాజల్ సంతోషాన్ని వ్యక్తంచేస్తోంది. ఇదిలావుండగా, ఆమె సోదరి నిషాఅగర్వాల్ కూడా తెలుగులో హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment