అల్లు అర్జున్ కథానాయకుడిగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'బద్రినాథ్'. దీనికి నిర్మాత అల్లు అరవింద్. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా నాయికగా నటిస్తోంది. చిన్నికృష్ణ కథని సమకూర్చారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిత్రవిశేషాలను దర్శకుడు వి.వి.వినాయక్ తెలుపుతూ 'భద్రినాథ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నట్టు ఇది సోషియో ఫాంటకీ కాదు. పక్కా లవ్, యాక్షన్, డ్రామా చిత్రం. ఈ చిత్రం గురించి మరిన్ని అబ్బురపరిచే విషయాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ 'ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విడుదల చేస్తున్నాం. ఆియోను ఈనెలాఖరున విడుదల చేసి, మే చివర్లో సినిమాను రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.
ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్‌హెయిన్స్, ఆర్ట్: ఆనందసాయి, ఛాయాగ్రహణం: ఎస్. రవివర్మన్, నిర్మాణసారధ్యం: మధు.
No comments:
Post a Comment