కొత్త విధి విధానాన్ని ప్రకటించిన టెలికం మంత్రి సిబాల్
న్యూఢిల్లి: నూతన టెలికాం విధానానికి సంబంధించి విస్తృత పరిధిలో విధివిధానాలను టెలికాం మంత్రి కపిల్ సిబల్ ఇక్కడ ప్రకటించారు. ఈ నూతన విధానాల ఆవిష్కరణ అనంతరం సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెక్ట్రం వినియోగంపై ఆడిట్ నిర్వహణ, కేటాయింపులు, లైసెన్సులను స్పెక్ట్రం నుంచి వేరు చేయడం, విలీనం, సేకరణల మార్గదర్శకాలలో మార్పులు మొదలైన సంస్కరణలకు ఈ నూతన విధానంవల్ల వీలు ఏర్పడుతుంది. ''వివిధ సంస్థలు స్పెక్ట్రం ఆడిట్, వినియోగాలపై క్రమం తప్పకుండా పరిశీలన జరపాల్సి వుంటుంది. ఇది ఎంతైనా అవసరమని మేం భావిస్తున్నాం. ఆ పనిని కాగ్ (కంఎ్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చేపట్టాలా లేక ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చేపట్టాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'' అని కపిల్ సిబల్ చెప్పారు.''భవిష్యతులో లైసెన్సులన్నీ ఏకీకృత లైసెన్సులుగా ఉంటాయి. లైసెన్సుల నుంచి స్పెక్ట్రమ్‌ను విడదీయడం జరుగుతుంది'' అని ఆయనచెప్పారు. ఇంతకు ముందు అమలులో ఉన్న మాదిరి లైసెన్సుల రెన్యూల్ 20 ఏళ్ళకు ఒకసారి కాక 10 ఏళ్ళకే రెన్యూల్ చేయడం జరుగుతుంది''అని సిబల్ చెప్పారు.
2జి కేసులో లలిత్‌ను ప్రాసిక్యూటర్‌గా నియమించాలని కోరిన సుప్రీం కోర్టు
కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాకూ ఇతరులకు ప్రమేయం ఉన్న 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం కేసు విచారణలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది యు.యు.లలిత్‌ను నియమించవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని సోమవారంనాడు సుప్రీంకోర్టు కోరింది. సిబిఐతరఫున వాదించే న్యాయవాదులప్యానల్‌లోని తన యిష్టం వచ్చినవారిని ప్రాసిక్యూటర్‌లుగా నియమించుకునే స్వేచ్ఛను లలిత్‌కు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ప్రాసిక్యూటర్లబృందం ఏప్రిల్ 24వ తేదీనాడు అనుబంధ చార్జిషీట్ దాఖలుచేస్తుంది.
విచారణసందర్భంగా లలిత్‌కు సహకారం అందించేందుకు సిబిఐ తనన్యాయవాదులను కేటాయించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. అర్హతల ప్రమాణాలు సరిపోలేదన్న కారణంపై లలిత్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించేందుకు ఇంతకుముందు ప్రభుత్వం నిరాకరించింది. జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ కె. గంగూలీతోకూడిన సుప్రీంకోర్టుబె ంచ్ రోజువారీ విచారణలు జరుగుతాయనీ, వాయిదాలకు ఆస్కారమేలేదని స్పష్టంచేసింది. ఈ కేసుకు సంబంధించిన దరఖాస్తునుకానీ, పిటిషన్‌ను కానీ సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర కోర్టులూ అనుమతించవు అని బెంచ్ స్పష్టం చేసింది.ఈ నెల 24న సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నట్టు సిబిఐ తరఫున కోర్టుకు హాజరయిన న్యాయవాది కె.కె. వెణుగోపాల్ చెప్పారు
No comments:
Post a Comment