Friday, April 15, 2011

గాయని చిత్ర కుమార్తె నందన మృతి

ప్రముఖ సినీ నేపథ్య గాయని కె.ఎస్‌.చిత్ర కుమార్తె నందన దుబాయ్‌లో జరిగిన స్విమ్మింగ్‌ఫూల్‌ ప్రమాదంలో మృతిచెందింది. నందన వయసు తొమ్మిది సంవత్సరాలు. విజయశంకర్‌, చిత్ర దంపతులకు పెళ్లయిన 14 సంవత్సరాల అనంతరం 2002లో నందన పుట్టింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సారథ్యంలో జరగబోయే షో కోసం చిత్ర దుబాయ్‌కి తనతోపాటు కుమార్తె నందనను కూడా తీసుకెళ్లారు. అక్కడి ఓ హోటల్‌లోని స్విమ్మింగ్‌ఫూల్‌లో పడిపోయిన నందన మృతిచెందడంతో ఆ కుటుంబం దుఖ:సాగరంలో మునిగిపోయింది. దాదాపు పది భాషల్లో వేల పాటలు పాడిన చిత్ర కుటుంబంలో జరిగిన ఈ విషాదవార్త తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానులను కలచివేసింది. చిత్ర కుటుంబానికి ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు సంతాపం వ్యక్తంచేశారు.

No comments:

Post a Comment