న్యూఢిల్లీ : గుజరాత్, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్రమోడి, నితీష్‌కుమార్‌లు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ప్రశంసలు గుప్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఆదివారంనాడిక్కడ మీడియా సమావేశంలో హజారే మాట్లాడుతూ ''ఆయా రాష్ట్రాలలో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న గుజరాత్, బీహార్ ముఖ్యమంత్రుల పనితీరు ప్రశంసనీయమైనది, మిగతా ముఖ్యమంత్రులు వారిని ఆదర్శంగా తీసుకుని, తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని'' పేర్కొన్నారు. ''తానేదో ఓ పార్టీని దృష్టిలో వుంచుకుని మాట్లాడటం లేదని, కేవసం అభివృద్ధి పరంగా మాత్రమే తాను ఈ సూచనలు చేస్తున్నానని'' హజారే స్పష్టం చేశారు.
No comments:
Post a Comment