న్యూయార్క్ : టైమ్ మాగజైన్ 2010 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచంలో అత్యంత పలుకుబడి గల 100 మంది ప్రముఖుల జాబితాలో భారత క్రికెట్ కెప్టన్ మహేంద్ర సింగ్ దోనీ 52వ స్థానంలో నిలిచి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియొనెల్ మెస్సీ కంటేకూడా ముందున్నారు. ఒబామా 86వ స్థానంలోనూ, మెస్సీ 87వ స్థానంలోను నిలిచారు. జాబితాలో ప్రథమ స్థానాన్ని గూగుల్ ఎగ్జిక్యూటివ్ వేల్ ఘోనిమ్ ఆక్రమించారు. ఈ జిప్టు విప్లవంలో ఘోనిమ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జాబితాలో క్రీడారంగానికి చెందిన ఏకైక భారతీయుడు ధోనీకాగా, ఇతర రంగాలకు చెందిన నలుగురు భారతీయులకు కూడా జాబితాలో స్థానం లభించింది. ''టైటాన్ ఆఫ్ ఇండస్ట్రీ'' గా ముఖేష్ అంబానీకి జాబితాలో 61వ స్థానం, 'బ్రెయిన్ మేపర్' గా వి.ఎస్.రామచంద్రన్‌కు 79వ స్థానం, 'ఫిలాంత్రఫిస్ట్' గా అజీమ్ ప్రేమ్‌జీకి 88వ స్థానం, 'ఛేంజ్ ఏజెంట్' గా అరుణా రాయ్‌కి జాబితాలో 89వ స్థానం లభించాయి. ధోనీని ''కెప్టెన్ ఆఫ్ ఫాంటాస్టిక్'' గా టైమ్ మాగజైన్ అభివర్ణించింది. టెండూల్కర్ తరువాత టైమ్ మాగజైన్ 100 మంది ప్రపంచ పలుకుబడిగల వ్యక్తుల జాబితాలో మంచి ర్యాంకు పొందిన క్రీడాకారులలో ధోనీ రెండవవారు.
జాబితాలో స్థానం దక్కిన ఇతర ప్రముఖులలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ (43వ స్థానం దక్కించుకుని ఒబామాకంటేకూడా ముందున్నారు), ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్, (6వ స్థానం), వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజె(9వ స్థానం) ఉన్నారు.
No comments:
Post a Comment