- ట్రస్ట్ వ్యహారాలపై భక్తులను బాధిస్తున్న మీడియా కథనాలు
- బాబాకే నేరుగా విరాళాలు... చెక పవర్ ఆయనదే
- కార్యక్రమాలన్నీ పారదర్శకమే, సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే
- సహాయం కోసం ట్రస్ట్ సభ్యులుగా కొందరి నియామకం
- బాబా స్థానంలో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తుల విశ్వాసం సడలే అవకాశం లేదు
హైదరాబాద్: కోట్లాది మంది భక్తులు అవతార పురుషుడిగా భావిస్తున్న సత్యసాయి బాబా అంపశయ్యపై ఉంటే ఆయన తర్వాత సత్యసాయి ట్రస్ట్ నిర్వహణా బాధ్యతల్ని ఎవరు చేపట్టాలన్న అంశంపై విస్తృతంగా మీడియాలో చర్చలు జరగడం బాబా భక్తుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. డాక్టర్లు గంటకో రకంగా సత్యసాయి ఆరోగ్యంపై ప్రకటనలిస్తున్నప్పటికీ భక్తులంతా సాయిబాబా తప్పకుండా కోలుకుంటారని, తిరిగి తమకు దర్శనిమిస్తారని, తమనాశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏదో అద్భుతం జరిగి తీరుతుందని నమ్ముతున్నారు. కానీ బాబా సజీవుడిగా ఉండగానే ఆయన అనంతరం జరగాల్సిన కార్యక్రమాలపై బాధ్యత కలిగిన మీడియా, కొంతమంది వ్యక్తులు చేపట్టిన విషప్రచారం వీరందరినీ బాబా ఆరోగ్య స్థితికంటే కూడా ఎక్కువగా బాధిస్తోంది.
సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడిగా సాక్షాత్తు సాయిబాబాయే ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ట్రస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాలన్నీ ఆయనకే నేరుగా వస్తున్నాయి. ప్రతిపైసాను ఆయనే ఖర్చు చేస్తూవచ్చారు. చెక్కులపై సంతకాలు పెట్టే అధికారం ఆయనొక్కరికే ఉంది. ట్రస్ట్‌లో బాబా తర్వాతెవరు ? అనే చర్చకే తావులేదు. బాబాను చూసే భక్తులు విరాళాలిచ్చారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న కళాశాలలు, వైద్యశాలలు, మంచినీటి పథకాలు, ఇతర సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకే బాబా కొంతమంది సహాయకుల్ని ట్రస్ట్ సభ్యుల పేరిట నియమించుకున్నారు. బాబా పట్ల భక్తులకున్న విశ్వాసం ఈ ప్రపంచంలో మరెవరిపట్ల వారికుండదు. బాబా ఆధ్వర్యంలో తమ విరాళాలు సద్వినియోగమౌతాయని, బాబా ఆశయాలకనుగుణంగా వాటిని వ్యయం చేస్తారన్న విశ్వాసంతోనే ఇప్పటికీ విరాళాలు వెల్లువెత్తున్నాయి. బాబా స్థానంలో మరెవరున్నా విరాళాల వెల్లువ ముందుకుసాగదు. కేవలం ప్రభుత్వ అజమాయిషీలో ట్రస్ట్ కొనసాగితేనే దీనికి విశ్వసనీయత ఉంటుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణంతా పాలకమండలి సభ్యు లే చేపట్టినప్పటికీ పూర్తి పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానికే ఉంటు ంది. పాలకమండలి సభ్యులు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభుత్వ ఆమోదం మేరకే అమలౌతున్నాయి. వారు చేపట్టే ఖర్చులకు పరోక్షంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. అందుకే టిటిడి పట్ల ప్రజల్లో నమ్మకం సడలడంలేదు. రోజూ కోట్ల రూపాయలు టిటిడికి విరాళాలుగా అందుతున్నాయి.
No comments:
Post a Comment