Tuesday, April 12, 2011

గెలుపు మార్గం..అవగాహన!


ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికైనా, ఎంతో కాలంగా పనిచేస్తున్న వారికైనా గుర్తింపు ముఖ్యం. ఇది భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేస్తుంది. వేతనాల పెంపుదలలో, పదోన్నతులలో ప్రముఖ పాత్ర గుర్తిం పుదే. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అంటే... అది సత్ఫలితాల సాధనను బట్టి ఉంటుందంటున్నారు కెరియర్‌ నిపుణులు. చేసే పనిని బట్టి, పని చేస్తున్న రంగంలో అవగాహనను బట్టి సత్ఫలితాలుంటాయని, అవి వ్యక్తిగతంగా ఎదగడానికేగాక, పనిచేస్తున్న సంస్థ, రంగం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతాయని హెచ్‌ఆర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధమైన గుర్తింపునూ, సత్ఫలితాలనూ సాధించే మార్గాలు మనమూ అన్వేషిద్దామా!
ఉద్యోగం కుదరగానే సరిపోదు, అక్కడి పని, వాతావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి. వివిధ ఉద్యోగ స్వభావాల గురించి తెలు సుకోవాలి. రోజువారి నిర్వర్తించే పనులూ, బాధ్యతలూ గుర్తించాలి. అవసరమైన నైపుణ్యం ఏర్పర్చుకునేందుకు ఉపకరించే అంశాలను పరి శీలించాలి. అంతేకాదు ఏ చిన్న పాటి సందేహం వచ్చినా నివృత్తిచేసు కోవడానికి ప్రయత్నించాలి. అక్కడుండే సీనియర్లను అడిగి తెలుసు కోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడ మన పాత్రేమిటో, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలో అర్ధం చేసుకునే వీలు కలుగుతుంది. అంతా ఒకేలా ఉండకపోవచ్చు తాము పని చేసే చోట ఫలానా విధంగా ఉంటే బాగుండునని అనుకో వడంలో తప్పు లేదు. కానీ అంతా అనుకు న్నట్లే ఉండకపోవచ్చు. ఒక్కో సంస్థకు, ఒక్కో రంగానికి ఒక విధమైన పని సంస్కృతి, లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి అక్కడి పరిస్ధితిని అర్ధం చేసుకుని మస లుకోవాలి. వస్త్రధారణ, క్రమశిక్షణ, పల కరింపులు, పాటించే పద్ధతులు ఇలా అన్ని
విషయాల్లోనూ అవగాహన ఏర్పరచుకుని అందు కనుగుణంగా నడ్చుకోవాలి.
విమర్శలు ఎదుగుదలకు మార్గాలు
మీ పనితనాన్నో, మిమ్మల్నో ఎవరైనా విమర్శిస్తున్నారంటే వెంటనే కృంగిపోకూడదు. ఆ విమర్శలో వాస్తవముందో లేదో విచక్షణగా ఆలోచిం చాలి. అది సద్విమర్శే అయితే స్వీకరించాలి. అది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పనిలో మెరుగుదలకు తోడ్పడుతుంది. విమర్శలు కూడా ఎదిగే మార్గాలని గ్రహించగలిగితే అదీ ఒక ప్లెస్‌ పాయింటే నని భావించాలి. విమర్శించారని బాధపడుతూ కూర్చుంటే మీరు అక్కడే ఉండిపోయే ప్రమాదముంది. సద్విమర్శలైతే హుందాగా స్వీకరించే నైజాన్ని అలవర్చుకోవాలి.
సమయపాలన
ఫలానా టైం వరకే నా డ్యూటీ. నేను అంతవరకే పనిచేస్తాను అని కొందరు అంటారు. అయితే ఇక్కడ ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పనిలో బాగా నైపుణ్యం సంపాదించి మన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఈ విధమైన సమయ పాలన సరైనదే. అయితే నేర్చుకునే దశలో మాత్రం ఇలాంటి పట్టింపులు నష్టం చేకూరుస్తాయి. సమయం కంటే సామర్ధ్యం పెంపొందించుకోవడం, నైపుణ్యం అలవర్చుకోవడం ముఖ్యం. కాబట్టి అవసరమైనప్పుడు అదనపు సమయం కేటాయించి చేస్తున్న ఉద్యోగంలో పట్టు సాధించాలి. తాము ఉద్యోగం చేస్తున్న రంగంలో మరిన్ని సదవకాశాలు కావాలంటే అదనపు సమయాన్ని కేటాయించాలా వద్దా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
పరిచయాలు
ఎవరితో మనకేంటీ మన పని మనం చేసుకపోతే చాలు అని కొందరి అభిప్రాయం. కానీ ఈ విధమైనటువంటి అవగాహన సరైంది కాదు. పని చేస్తున్న కార్యాలయాల్లోనైనా, ఇంకెక్కక్కడైనా పరిచయాలు
పెంచుకోవాలి. దీనివల్ల అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి, మానసిక ఉల్లాసం పెంపొం దడానికి అవకాశముంటుంది. పరిచయాలే కొందరికి సదవకాశాలు తెచ్చి పెడుతుంటాయి. ఎదుగుదలకు బాటలు వేస్తుంటాయి. కాబట్టి పరిచయాలు అర్హతలుగా పరిగణించవచ్చు.
తొందరపాటు తగదు
కొత్త ఉద్యోగం లోకి చేరాక అక్కడ చేసే పరి పట్ల ఆసక్తి లేకపోయినా తొందరపాటు నిర్ణయం తీసుకో వద్దు. నిరుత్సాహం అంతకంటే వద్దు. అప్పజెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించే బాధ్యతగల ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలి.ఆ తర్వాత ఇష్టమైన పనిని అప్పగించేందుకు సంస్థ గానీ, పై అధికారులు గానీ కాదనే అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి సందర్భం లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కటి అవకాశాలు ఎలా రాబట్టుకోవాలో ఆలోచించగలగాలి. ఈ విధమైన అవగాహనతోపాటు, కనీసంగానైనా సాంకేతిక పరిజ్ఞానం కలిగిఉంటే ఎక్కడైనా, ఏ ఉద్యోగంలో ఉన్నా సత్ఫలితాలిస్తాయి. అవే సక్సెస్‌కు దారి తీస్తాయి.

No comments:

Post a Comment