'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రకథ మొత్తం రాత్రివేళల్లోనే జరుగుతుందని దర్శకుడు ప్రేమ్‌రాజ్ తెలిపారు. చార్మి కథానాయిక కాగా జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. గురుదేవ క్రియేషన్స్ పతాకంపై నంది శ్రీహరి, టేకుల ముక్తిరాజ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ప్రేక్షకులను ఆలోచన రేకెత్తించేవిధంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. రెగ్యులర్ కథాచిత్రాలకు భిన్నంగా సమ్‌థింగ్ స్పెషల్‌గా దీనిని మలుస్తున్నామని ఆయన చెప్పారు. పాటలతో సహా చిత్ర నిర్మాణం మొత్తం పూర్తయిందని, అలాగే డబ్బింగ్ కూడా పూర్తిచేశామని ఆయన తెలిపారు. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 27న ఆడియోను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
జగపతిబాబు నటనతో పాటు, మహిళా జర్నలిస్టుగా చార్మి నటన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, పిళ్ళాప్రసాద్, బాబూమోహన్, ఆహుతిప్రసాద్, ఉత్తేజ్, శివారెడ్డి, గోరేటి వెంకన్న, పృథ్విరాజ్, వైజాగ్ ప్రసాద్, సత్యప్రకాష్, తస్లిమాషేక్, గాంధీ తుమ్మల, సారికా రామచంద్రరావు, అనంత్, గుండు హనుమంతరావు, జెన్నీ, గుండు సుదర్శన్, సంధ్యాజనక్, సుప్రజ, విజయభాస్కర్ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి కథ: దీన్‌రాజ్, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, ఛాయాగ్రహణం: లక్ష్మీనరసింహన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నంది నరహరి, సహ నిర్మాత: టేకుల ముక్తిరాజ్, నిర్మాత: నంది శ్రీహరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌రాజ్.
No comments:
Post a Comment