Friday, April 1, 2011

నమిత 'లవ్‌ కాలేజ్‌'


అందాల నటి నమిత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లవ్‌ కాలేజ్‌' కోసం ఇటీవల యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. జయసింహా పిక్చర్స్‌ పతాకంపై జయసింహారెడ్డి దర్శకత్వంలో రవితేజారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్‌ ఫ్యాక్టరీలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని, దీనికి థ్రిల్లర్‌ మంజు ఆధ్వర్యం వహించార'ని దర్శకుడు తెలియజేశారు. 'యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునే రీతిలో వచ్చాయి. థ్రిల్లర్‌ మంజు కంపోజింగ్‌ చేసిన ఫైట్స్‌ సినిమాలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చిత్రంలో నమిత కాలేజ్‌ లెక్చరర్‌గా నటిస్తోంది. పెడతోవ పడుతున్న విద్యార్థు లను నమిత ఎలా మంచి మార్గంలోకి తీసుకువచ్చిందనేది ఈ చిత్రకథాంశం. మరొ వారంలో ఆడియోను, ఈనెల చివరి వారం లో సినిమాను విడుదల చేస్తామ'న్నారు.
ఈ చిత్రంలో నమిత, పృథ్వీరాజ్‌, శోభన్‌, కవిత, డి.శ్రీకాంత్‌ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం దివాకర్‌, ఎడిటింగ్‌ రంగస్వామి, ఫైట్స్‌ థ్రిల్లర్‌ మంజు, నిర్మాత యమ్‌. రవితేజారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం యమ్‌. జయ సింహారెడ్డి.

No comments:

Post a Comment