విజ్ఞా నం పేరిట జరు గుతున్న జంతుమే ధం అంతా యావత్ మానవాళి కోసం... విశ్వ కళ్యాణం కోసమే అంటూ ఎం దరు ఊదర గొట్టినా దానిని విశ్వ సించలేం. అయితే మనిషి చేసుకు పోతున్న తపðలకు తానే ఫలితాలను అనుభవిస్తూ...తత్ఫలితంగా వస్తున్న నానా రకాల రోగాల బారిన పడుతూనే ఉన్నాడు. ఈ వ్యాధుల నిర్మూలన కోసం వివిధ రకాల పరిశోధనల పేరుతో జరుగుతున్న తతంగానికి సమిధల్లా మాడుతున్నది మూగజీవాలేే. ఈ జంతు మేధానికి కారణాలు అనేకమైనా... చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ మానవులు తమ దైనందిన జీవితంలో వినియోగిస్తున్న ప్రతి మందు వెనక వివిధ రకాలైన జంతువులు తమ ప్రాణాలను పణంగా పెట్టాయి.వాటి మీద ప్రయోగాత్మకంగా వాడి విజయవంతమైన తరువాతే, వాటిని మానవులు వినియో గిస్తున్నారన్నది వాస్తవం.
ఇలా ప్రయోగాల కోసం బలవుతున్న జంతువుల గోడును పట్టించుకునే నాధులు ప్రపంచంలో దాదాపు లేనే లేరు. ఈ కారణంగా ఈ జంతుమేధం నిరాటంకంగా సాగుతోంది. ఎన్నో బాధలకు గురై, జీవచ్ఛవాలుగా మారి నశించిపోతున్న, జంతువుల గురించి నేటికీ సరైన అంచనాయే లేదంటే... మనిషి మూగజీవా లపై చూపిస్తున్న శ్రద్ధ ఏపాటిదో అర్థ్ధం చేసుకో వచ్చు. అయితే, ప్రతిఏటా 25 కోట్ల జంతు వులు 'వైజ్ఞానిక పరిశోధన'లలో పాల్గొంటు న్నట్టు ఓ అంచనా ఉంది. వీటిలో 70శా తం జంతువులకు పరిశోధనల సమ యంలో ఎలాంటి మత్తు మందూ ఇవ్వకుండానే ప్రయోగాలు నిర్వ హిస్తుండటంతో చాలా వరకు చనిపోతున్నాయి. తద్వారా ఆయా జాతుల జంతు వుల ఉనికి ఈ ప్రపంచంలో కనిపించనంత ప్రమా దం ఏర్పడింది. కేవలం పరిశోధనల కోసమే కొన్ని జంతువులను ఉత్పత్తి చేయిస్తు న్నారంటే... పరిస్ధితి ఎందాక వెళ్లిందో అర్థ్ధం చేసుకోవచ్చు. అంతెందుకు, క్యాన్సర్ పరిశోధనలకు చిట్టెలుకని 3,500 రూపాయలకు,. చింపాంజీని వేల డాలర్లు వెచ్చించి కొంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిట్టెలుకలు వేలల్లో ప్రయోగం ప్రారంభానికి ముందే చనిపోతుండగా.. చింపాజీలలో చాలాభాగం జీవచ్ఛవాలుగా మిగిలి ఉన్నాయి. ఇక అమెరికా వీధుల నుంచి ఏటా సుమారు 2 నుండి 2.5 లక్షల కుక్కలు, పిల్లులను వివిధ కారణాలతో పట్టుకుంటున్న అధికారులు చివరికి వాటిని తీసుకువెళ్లి పరిశోధనలు చేసేవారికి అప్పగిస్తున్నారని, జంతు సంరక్షకుల బాధ్యతా రాహిత్యమే దీనికి కారణమని అమెరికాకు చెందిన జేమ్స్ వింగారైన్ తన వ్యాసంలో పేర్కొన్నాడు.
అదేవిధంగా బ్రిటన్‌లో ఒకవారానికి సుమారు 4వేల కుక్కపిల్లలు, పిల్లులు అదృశ్యమౌతున్నాయని బ్రిటన్‌కి చెందిన డాక్టర్ విటర్న్ కాల్‌మన్ తెలిపారు. కాల్‌మెన్ కృషి ఫలితంగా జంతువులపై పరిశోధనలను నిరోధించేందుకు ఒక బిల్లును స్విట్జర్లాండ్ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డాక్టర్స్ ఎగైనెస్ట్ వి వి సెక్షన్ (ఐ.ఎల్. డి.ఎ.వి) సెక్రటరీ జనరల్ మిల్లి ఛార్ మంజోలి ప్రయత్నించారు. మందుల తయారీ సంస్ధలు, వైద్య శాస్త్ర వేత్తలు అనాగరికంగా జంతువులను బలి తీసుకోవడాన్ని నిరసిస్తూ, శాకాహార, జంతుప్రియుల సంఘం పోరాడు తున్నా ఫలితం అంతంత మాత్రమే. ఈ జంతువులపై వైద్య విద్యార్థులతో చేయిస్తున్న ప్రయోగాలు ఫలితం ఎంతిస్తా యో పక్కన పెడితే వారిలో పాశవికతను పెంచుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో సైతం వెల్లడైంది. మనుషుల కన్నా జంతువులు ఏ విధంగానూ తీసిపోవని, వాటికీ సుఖ దు:ఖాలు అనుభవమౌతాయన్న విషయాన్ని
వైద్య పరిశోధకులు విస్మరిస్తున్నారు. జంతువులకు నొప్పి, భయం ఉంటాయన్న ఇంగిత జ్ఞానాన్ని వీరు మర్చిపోతున్నారు. జంతువులపై పరిశోధనలు మానవ పరిస్థితులను ప్రతిబింబించనపుడు ఫలితాలు మాత్రం ఎలా సంతృప్తికరంగా ఉంటాయి మానవులకు ఉండే క్షయ (ట్యూబర్‌క్యులోసిస్) జంతువులలో ఉండే క్షయ, అదే విధంగా మానవులలో క్యాన్సర్, చిట్టెలుకలలో క్యాన్సర్ ఒకేరకంగా ఉండదు. కానీ ప్రయోగాలలో ఆయా జాతుల జంతువులు మాత్రం తమ జీవితాలని త్యాగం చేయవల్సి రావటం ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటికే అనేక మందులను జంతువులపై ప్రయోగాలు చేసి. అదరగొట్టే ఫలితాలు అందుకున్నామని చెప్పినా, తీరా అవి మానవాళి కోసం మార్కెట్‌లోకి వచ్చాక అవి దుష్ఫలితాలు కలుగజేసిన సంఘటనలు కోకొల్లలు.
ఓసారి జంతువులపై ప్రయోగాల విషయాన్ని పరి శీలిస్తే, జంతువు కంటికి ఒక రకమైన పరీక్ష నిర్వ హించి 'డిటర్జంట్' పదార్థాన్ని ఎక్కించి, 4రోజులపాటు వదిలేస్తారు. దాదాపు ఇలాంటి ప్రయోగాలకు ఎక్కువగా కుందేళ్లను వాడుతారు. ఎందుకంటే కుందేళ్లు సాధు జంతువులే కాకుండా, వాటి కంటిరెప్పలు తెరవడానికి అనుగుణంగా వుంటాయి. ఈసందర్భంగా వేల కుందేళ్లు కళ్లు దెబ్బ తింటున్నాయి. ఇటువంటి విషమ పరీక్షలను జంతువులు ప్రయోగం పేరిట ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డాక్టర్స్ ఎగైనెస్ట్ వి వి సెక్షన్ నేరు గా ప్రజలకు ప్రశ్నలను సంధించింది.
1. ప్రయోగాల పేరిట జంతువధ కారణంగా మానవునికి కలిగే ప్రయోజనం ఏమైనా వుందా
2. జంతువులకు, మానవ శరీర నిర్మాణంలో వ్యత్యాసం ఉందని వైద్యశాస్త్రమే ఘోషిస్తున్నపðడు ఈ ప్రయోగాలు ఎలా మానవాళికి ఉపయోగపడతాయి
3. జంతువులపై ప్రయోగంలో కౄరత్వం, అజ్ఞానం కలగలిపి ఉంది. సృష్టిలో మరొకరి కోసం కీటకం, జీవి త్యాగం చేస్తున్నది. ఇది నైతికంగా ధర్మమేనా
ప్రకృతిలో మానవాళి శ్రేయస్సుకోసం నేరుగానే తమ ధర్మాలను అందిస్తూ, వివిధ కోణాల్లో తమ వంతు సేవల్ని అందించే జంతువులు, కీటకాలను ప్రయోగాల పేరిట వధించడమంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అవుతుంది. సాంకేతిక ప్రగతి మాత్రమే ప్రపంచానికి ఎన్నటికీ మేలు కాదన్నది వాస్తవం. నాగరికత మాటున ఇప్పటికే మనిషి జంతువులను మచ్చిక చేసుకుని, సుఖ జీవనాన్ని పొందుతున్నాడు. మాంసాహారం పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల జీవరాసుల్ని ఆహారం గా భుజించేస్తున్నాడు. రవాణా సౌకర్యాలు ఎంతగా పొంగి పొర్లినా, గ్రామీణ భారతంలో రైతుకు ప్రయోజనం కలిగిం చేవి నేటికీ పశుసంతతికి చెందిన దున్నపోతులు, ఎద్దులు, ఆవులు, గేదెలేనన్న విషయాన్ని మనం విస్మరించరాదు. మాన వాళికి జంతు సంతతి చేసే మేలుని మరచిన మానవుడు పరిశోధనల పేరిట జంతుహింసకి తలపడటం ఎంతవరకు సమంజసం ఈ జంతుహింసకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రా లలోని జంతు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో జంతు పరి శోధనా వ్యతిరేక ఉద్యమాలను చేపడ్తున్నా, ప్రజల నుండి సరైన మద్దతు అభించక పోవటం విచారకరమే.. జంతువు లపై వాక్సిన్‌లు, కాస్మటిక్స, మందులు, పురుగు మందులు, విద్యుత్తు షాక ఇవ్వడం, సిగరెట్ల పొగకి మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడంలాంటి పనులు అభ్యంతరకరం. ప్రయో గాల ముసుగులో వాటి కంటి రెప్పలను తీసివేయడం, మెదళ్ళు తొలగించేయటం ఓ ఎత్తయితే... భయంకర వ్యాధులని తెలిసి కూడా క్యాన్సర్, ఎయిడ్స్, డయాబెటిస్ వ్యాధులకు సంబం ధించిన వ్యాధి్థ కారకాలను వాటి శరీరాల్లోకి ఎక్కిస్తున్నారు.
ఆడవాళ్లకి అందాలను మెరుగులు దిద్దుతున్నామని చెపð కునే కాస్మటిక్స రంగంలోనూ జంతు హింస యధేచ్ఛగా సాగు తోంది. ఈ పరిశ్రమలో ఆయా ఉత్పత్తులను ముందుగా అధ్య యనం చేసేందుకు కుందేళ్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ప్రయోగాలలో కుందేళ్లపై వాడుతున్న రసాయన పదార్థాలతో అవి పడుతున్న బాధలు వర్ణ తాతీతం. చూపుని కూడా పోగొట్టుకున్న సందర్భాలు అనే కం. వీటి కనురెప్పలు మూతపడకుండా క్లిపðలు వాడి మరీ ప్రయోగాలు చేస్తా రు. మొత్తం మీద ప్రయోగాల పేరిట జంతువులను హింసించడా నికి, వధించడానికి మన శాస్త్రవేత్తలు, సంస్ధ లు ఎంతమాత్రం జంకడం లేదు. ఈ ప్రయోగాలలో మానసిక, బాహ్య ప్రవర్త నల అధ్థ్యయానికి, పరిశోధనలకు ఎలుకలు, కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, గొర్రెలు, పందులు లాంటి పలు జంతువులు బలైపోతున్నాయి. ప్రపం చవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల్లో విజ్ఞానం ముసు గులో వివిధ ప్రైవేట్ వ్యాపార సంస్థ్ధలు, ఆస్పత్రులు, విశ్వ విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ పరిశోధనాల యాలలో జరుగుతున్న ఈ పరిశోధనలను సామాజిక శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్నట్టుగా వైద్య పరిశోధకులు పేర్కొంటున్నా, అందులో పిసరంత కూడా నిజం లేదు. ఈ పరిశోధనలు నిర్వహించే సంస్థ్ధలు తమ తమ లాభాల కోసం ప్రయోగాలు చేసేవారిని ప్రోత్సహిస్తుంటే, పరిశోధకులు మాత్రం తమ పేరు చరిత్రపుటల్లో నిలచిపోవాలన్న తాపత్ర యంతోనే ఈ పరిశోధనలు చేస్తున్నారన్నది నిజం.
భారతదేశంలో 60 శాతంపైగా జనాభాకు నేటికీ సాధారణ ఆరోగ్య పరిరక్షణకే అవకాశంలేదని అధి కార వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయినా వ్యాధుల నిర్ధారణ, నివారణకు చర్యలు, అందుకు పరిశోధ నలు అంటూ ఏటా కోట్ల రూ్ప్పలు వ్యయం చేస్తున్నా సాధించింది అంతంతమాత్రమే. మానవాళి ప్రయోజనాలకంటూ ప్రయోగాల పేరుతో జరుగుతున్న ఈ పశుమేధం ఆపకపోతే ఆయా జంతురాశులు తమ మనుగడ కోల్పోయి, ప్రకృతి ధర్మం నెరవేర కుండా పోతుంది. తద్వారా మరిన్ని కొత్త రోగాలు పుట్టుకు రావటం ఖాయంగా కనిపి స్తోంది.
-సత్య గోపాల్
No comments:
Post a Comment