న్యూఢిల్లి: అన్నా హజారే తాను చేసిన అభివృద్ధి పనులను ప్రశంసించిన ఒక రోజు అనంతరం గుజరాత్ ముఖ్యమం త్రి ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. మోడీ తన బ్లాగ్ లో పోస్ట్ చేసిన ఈ లేఖలో అన్నా హజారే చేపట్టిన ఉద్య మాన్ని ప్రశంసించారు. హజారేను గౌరవనీ యులైన అన్నాజీ అని సంబోధిస్తూ, 'ఢిల్లిలో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనే వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా నేనూ ఉపవాసాలు చేయడం వల్ల , అసోంలో మీ ఆరోగ్యం గురించి కామాక్షీ దేవిని కోరినందువల్ల మీ ఉద్యమానికి పరోక్షంగా మద్దతు పలికినట్టయిందని పేర్కొన్నారు. అసోం, కేరళల్లో ఎన్నికల ప్రచారం ముగించుకు వచ్చిన నాకు గుజరాత్ గురించి మీరు వ్యక్తం చేసిన ప్రశంసా వాక్యాల గురించి తెలిసిందని, ఆది అదృష్టకరమని, మీ అశీస్సులకు ధన్యవాదాలు' అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు ముందు తాను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పని చేసినపుడు సమావేశాలకు హాజరైన జాతీయ నాయకులు మీ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను గురించి చరి ్చంచుకోవడం, వాటిని అనుస రించాలనడం గురించి మాట్లాడుకునేవారని, అవి తనపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. గతంలో నాకు మిమ్ములను కలిసే భాగ్యం కూడా కలిగిందని గుర్తుచేశారు. మీ ఆశీస్సులు నాకు ఏది మంచో అది చేసేందుకు బలాన్నిచ్చాయని అదే సమయంలో బాధ్యతను పెంచాయని ఆయన పేర్కొన్నారు. ఏనాడూ చెడు బాటలో నడవకుండా గుజరాత్ ప్రగతికే అంకితం కావాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మీరు గాంధేయవాదే కాక ఒక సైనికుడని ప్రశంసిస్తూ, మీ ఆశీస్సుల గురించి విన్నప్పుడు గుజరాత్ ప్రగతికి విరోధులైన శక్తులు మీకు వ్యతిరేకంగా పని చేయగలరన్న భయం కలి గిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ప్రగతిని ప్రశంసించిన పలువురిని ఉదహరిస్తూ వారందరూ ఆ శక్తుల చేతిలో సమస్యలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వారిలో అమితాబ్ బచ్చన్, గాంధే యవాది గుణవంత్ షా, దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ అధిపతిగా ఎన్నికైన గుజరాత్‌కు చెందిన మౌలానా ఘులాం వస్తానవి, మేజర్ జనరల్ ఐఎస్ సిన్హా తదితరుల పేర్లను ప్రస్తావి స్తూ, వారంతా గుజరాత్ ప్రగతిని ప్రశంసించినందుకు ఇబ్బందుల నెదుర్కొన్నారని ఉదహరించారు. అయితే గుజరాత్ లోని ఆరు కోట్ల మంది ప్రజలు మీరు ఆ వి ధమైన ఇబ్బందులకు గురి కారాదని కోరుకుంటున్నారని అన్నారు. అందువల్ల వారిని ఎదుర్కొనే బలం మీకు ఇవ్వాలని భగవంతుని కోరుకుం టున్నానని పేర్కొన్నారు. దేశం కోసం మీరు చేసిన త్యాగాలకు, దీక్షలకు తాను శిరసు వంచి అభివాదం చేస్తున్నానని పేర్కొన్నారు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి పలువురు మీ మార్గదర్శకత్వంలో ప్రయో జనం పొందగలరని భావిస్తున్నట్టు తెలిపారు. ఇది నా హృదయపూర్వక ప్రార్థన అని ముగించారు.
No comments:
Post a Comment